Anandha Bhairavi Telugu Novel
AnandhaBhairavi Telugu Novel
ఆనందభైరవి తెలుగు నవల
అది కాలేజి గరల్స్ హాస్టల్ వార్షికోత్సవం. రంగులడేరా వేశారు. అప్పుడా వేళ అక్కడ మన్మథుడు బావుటా ఎగరేశాడు. అంతటా గాజుల గలగలలే. అంతటా చీరల రెపరెపలే కొందరు మంచిగంధపు చెట్లలా వున్నారు. కొందరు మల్లెతీవల్లా వున్నారు. కొందరు మెరుపుతీగల్లా వున్నారు. కొందరు లేతమామిడి మొక్కల్లా వున్నారు. కొందరు విర బూసిన సన్నజాజిపొదల్లా వున్నారు. కొందరు అందాల భరిణల్లా వున్నారు. కొందరు బంగారుబొమ్మల్లా వున్నారు. కొందరు సెలయేళ్ళలా గలగల నవ్వుతున్నారు. కొందరు రాయంచల్లా హుందాగా నడుస్తున్నారు, కొందరు అందంగా కదులుతున్నారు. అప్పుడా వేళ అక్కడ అందరి మొహాల్లోనూ సంతోషమే, అందరి కళ్ళలోనూ అనందమే—
అప్పుడావేళ అక్కడ వున్నటుండి హఠాత్తుగా దీపాలారిపోయాయి. అప్పుడే వేళ అక్కడి సభలో సిల్కులాల్చీలు వున్నాయి, జరీకండువా లున్నాయి, ఖద్దరు పంచలున్నాయి, టైట్ప్యాంట్లున్నాయి, బెర్లినొచొక్కా -లున్నాయి, సూదిబూట్లున్నాయి, ఫుల్సూట్లున్నాయి, స్టెతస్కోపులున్నాయి, బట్టతలలున్నాయి, తుమ్మెద రెక్కలాంటి మీసాలున్నాయి, కాకిప్యాంట్లు న్నాయి, తెల్ల కమీజులున్నాయి. కాలేజీ గరల్స్ తాలూకు బ్రదర్సు, అంకుల్సు, కజిన్స్, సిటీ పెద్దలు, ఇంకా అలాంటివారందరూ కట్టకట్టుకొని వచ్చేరు. అడగాలి కాసేపుపీల్చి తన్మయంచెందడానికి కొందరూ, పిల్చిందే చాలనుకుని ‘కలర్స్’ చూడ్డానికి కొందరూ వచ్చేరు.
ఇక చదవండి….
Visitor Rating: 2 Stars
Visitor Rating: 3 Stars
Visitor Rating: 3 Stars
Visitor Rating: 2 Stars