Ankitham Telugu Novel

Ankitham Telugu Novel

అంకితం తెలుగు నవల

ఆందోళనని భూతద్దంలోంచి చూస్తే భయం అవుతుంది.

అయితే ఆమె పరుగెడుతున్నది ఆందోళనతోనూ, భయంతోనూ కాదు. భర్తతో కాపురం చేసిన ఏడాది కాలంలో భయమూ, ఆందోళనా లాంటి స్థాయి భావాల్ని ఆమె ఎప్పుడో దాటిపోయింది. అతన్నించి ఎలాగయినా రక్షించుకోవాలన్నదే ఆమె ప్రయత్నం. తనని కాదు… తన కొడుకుని.

ఆమె చేతిలో ఓ పసిగుడ్డు వుంది. పుట్టి వారంరోజులు కూడా కాలేదు. జరుగుతున్న దారుణం తెలిసో, ఏమో గుండెలవిసేలా ఆ శిశువు ఏడుస్తున్నాడు. అయితే ఆ ఏడుపుని కుక్కల అరుపులు డామినేట్ చేస్తున్నాయి. రాత్రి పన్నెండవుతోంది. దానికి అరగంటముందే జరిగిందా సంఘటన! ఆ శిశువుమీద హత్యా ప్రయత్నం!! చేసిందెవరో కాదు.

ఆమె భర్త!!!
గుమ్మందగ్గర అలికిడి అవడంతో ఆమె కళ్లు విప్పి చూసింది. లోపలికి ప్రవేశిస్తున్నాడు. ఆమె నిద్రపోతోందన్నభావంలో వు డ్డు పక్కన అమర్చిన దిండు నెమ్మదిగా తీసాడు. చప్పుడు చేయకుండా శువు మొహం మీద పెట్టి చేత్తో బలంగా వత్తసాగాడు.

ఆమె ఆ దృశ్యాన్ని ఎంత షాక్ తో చూసిందంటే, లిప్తపాటు అది నమో అర్ధం కాలేదు. మనుషుల్లో ఇంత కిరాతకులుంటారని ఆ తరాలు కల్లో కూడా ఊహించలేదు.

పెళ్ళయినప్పటినుంచీ అతడి అనుమానం తెలుస్తూనే వుంది. గర్భం కన్ఫర్మ్ అయ్యాక అది సణుగుడుగా మారింది. అదింత వికృతరూపం దాల్చిందని ఇప్పుడే తెలుస్తోంది. ఆమె కంత బలం ఎక్కడినుంచి వచ్చిందో తెలీదు! ఒక్క ఉదా చంమీదనుంచిలేచి, అదే వేగంతో అతణ్నీ వెనక్కి తోసేసింది. అతడి తలకి వెళ్లికొట్టుకుంది.

ఇక చదవండి….

Ankitham-yendamuri-novel_Page_003

Ankitham-yendamuri-novel_Page_003
Picture 3 of 102

 

Sending
User Review
4 (6 votes)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *