Beautiful Enemy Telugu Novel

Beautiful Enemy Telugu Novel

బ్యూటిఫుల్ ఎనిమి తెలుగు నవల

బ్యూటిఫుల్ ఎనిమీ నవల ‘హమారా షెహర్ డాట్ కామ్’ పోర్టెల్లో నవలగా వచ్చింది. ఈ నవలను తెలుగులో అందమైన శత్రువుగా, ఇంగ్లీషులో బ్యూటిఫుల్ ఎనిమీగా హిందీలో సుందర్ శత్రుగా ‘హమారా షెహర్ డాట్ కామ్’ వారు పాఠకులకు అందించారు. శ్రీ జి.వి. అమరేశ్వరరావు తెలుగులో రాసిన ఈ నవలను ‘హమారా షెహర్ డాట్ కామ్’ వారు హిందీ, ఇంగ్లీష్ భాషల్లోకి అనువదించి పాఠకులకు అందించారు.

ఈ నవలకు ఒక ప్రత్యేకత వుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి ఇంటర్ నెట్ నవల. ఇది ప్రపంచ స్థాయిలో రెండవ ఇంటర్నెట్ నవల. ప్రపంచస్థాయిలో మొట్టమొదటి ఇంటర్ నెట్ నవలను ఇంగ్లీష్ రచయిత ‘స్టీఫెన్కింగ్’ రచించారు. స్టీఫెన్సింగ్ రాసిన నవలను నెట్ లో చదవాలను కునేవారు ప్రతి పార్టుకు ఒక డాలర్ చొప్పున చెల్లించాలి. కాని ‘హమారా ‘షెహర్ డాట్ కామ్’ వారు వర్ణచిత్రాలతో, మూడు భాషలలో వెలువడిన బ్యూటిఫుల్ ఎనిమీ నవలను పాఠకులకు ఉచితంగా అందించారు.

ఈ విధంగా ‘హమారా షెహర్ డాట్ కామ్’ వారు భారతదేశంలోనే తొలిసారిగా ఇంటర్ నెట్ నవలకు నాంది పలికి రికార్డు సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ నవలను అనేక లక్షలమంది తెలుగు, హిందీ, ఇంగ్లీషు పాఠకులు చదివారు, ప్రశంసించారు.

ఇక చదవండి….

Beautiful-Enemy_Page_102

Beautiful-Enemy_Page_102
Picture 102 of 102

Sending
User Review
3 (1 vote)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *