Adharvana Yagnam by Suryadevara
Adharvana Yagnam by Suryadevara
అధర్వణ యజ్ఞం
అధర్వణ యజ్ఞం
-సూర్యదేవర రామ్మోహనరావు
సిటీ పొలిమేరకు రెండు కిలోమీటర్ల దూరంలో హైవేనానుకొనివున్న చిట్టడివి ప్రాంతం. హెవీ కరెంట్ లైను కోసం విద్యుత్ శాఖ వారు ఎగువనుంచి ఎత్తయిన పోలి ని వేసుకుంటూ వస్తున్నారు. హైవేకు మూడువందల గజాల దూరంలో పోల్స్ నిర్మాణం కోసం లోతయిన గుంతలు తీశారు. ఆ రోజుతో పని ఆపి వెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికే….
వారు తవ్వినచోట విచిత్రంగా
గుంత…. బొందగా……
బొంద….. లోయగా….
బోయ సొరంగంగా మారిపోయింది.
తెల్లవారి తిరిగి పని ఆరంభించటానికొచ్చిన డిపార్ట్ మెంట్ వాళ్ళకి అక్కడ గుంతలకి బదులు సుమారు ఏదైమీటర్ల వ్యాసంలో భూమిలోకి ఏర్పడిన సొరంగం కనబడి కంగారు పుట్టించింది.
ఏం జరిగింది?
నిశ్శబ్ధంగా రాత్రికి రాత్రి భూమి కృంగిపోవటం ఏమిటి?
నిలువునా సొరంగం ఏర్పడటం ఏమిటి?
తొంగిచూసిన వారికి చీకటితప్ప ఏమీ కన్పించలేదంటే అది ఎంత లోతుకు ఏర్పడిందో అర్ధమవుతుంది. పైగా అంత లోయగా సొరంగం ఏర్పడినా, చుక్కనీరు కూడా పొంగి రాకపోవటం వింతల్లో వింత.
క్షణాల్లో ఈ వార్త సిటీలోకి వ్యాపించిపోయింది..
పోలీసులు వచ్చారు.
జనం ఎవరూ సారంగం అంచులవద్దకి పోకుండా సొరంగాన్ని చుట్టి బారికేడ్లుకట్టి కాపలా వున్నారు. మీడియావారు పరుగులెత్తుకొచ్ని ఫోటోలు తీసారు.
Visitor Rating: 5 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 2 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 2 Stars
Visitor Rating: 1 Stars