ammori navvu Telugu Novel
ammori navvu Telugu Novel
అమ్మోరి నవ్వు
ఎప్పుడు వచ్చి పడుతుందో తెలియని చావు పేరెత్తితేనే జనాలకి వచ్చేంత భయం. మరి కొంచెం సేపట్లో బావలో తెన్నాయి.. తెలిసిన నా పరిస్థితి ఎంత భయంకరమో కదా? చావడానికి ఎంతో ధైర్యం కావాలి. కానీ కొంచెం సేపట్లో దావబోతున్నామనే ఆలోచనని భరించడానికి ఇంకా ఎక్కువ ధైర్యం కావాలి. అదే మరణ యాతనంటి! నాన్న పూజా మందిరంలో భగవద్గీత చదువుకుంటున్నారు. నేనెళ్ళి గుమ్మం దగ్గరే నుంచున్నాను. నన్ను కూర్చోమన్నట్లుగా పైన
చేసి, ఆయన భగవద్గీతలో మునిగిపోయారు. అమ్మకి నాన్నకి దణ్ణం పెట్టి పోదామని నా ఉద్దేశ్యం. దీవెనల కోసం కాదుగాని, ఎదిగిన కొడుకుని ఈ వయస్సులో వాళ్ళకి ఆసరా లేకుండా చేస్తున్నందుకు క్షమించమని వేడుకోవడం కోసం. ఒక్కగానొక్క కొడుకునని నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నాకు ఏలోటూ చేయకుండా కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఈ రోజు నేను. విధిస్తున్న శిక్ష దారుణమైనది! రేపొద్దున్న నేను లేనని తెలిస్తే వాళ్ళు ఎంత తల్లడిల్లిపోతారో? నన్ను తల్చుకుని ఎంతగా కుమిలిపోతారో? ఊహించుకుంటేనే కడుపులోంచి బాధ తన్నుకొస్తోంది. కానీ కొన్ని నెలలనుంచీ కమల కోసం నేను పడుతున్న బాధ ముందు ఇది చాలా చిన్నది. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో, రెప్పవాలిస్తే చాలు మరుక్షణం ఉలిక్కిపడి లేచేవాణ్ణి. అర్ధరాత్రి మందం మీద అంతెత్తు ఎగిరిపడి వాణ్ణి. నిశ్చితార్ధం రోజు కమల వేలికి ఉంగరం పెట్టడానికి, పరాయివాడు ఆమెని తాకినప్పుడైతే నా బాధ వర్ణనాతీతం. అది అనుభవించిన వాడికే తెలుస్తుంది. గుండెని చెట్టుకొమ్మకి వేళ్ళాడదీసి రూళ్ళకర్రతో చితకబాదిన బాధ. ఎన్నాళ్ళు ఈ బాధ అనుభవించడం? ఇంతకన్నా
“లోకా స్సమస్తా స్సుఖినో భవంతు, సర్వేజనా స్సుఖినో భవంతు” అంటూ, నాన్న గీతాపారాయణ పూర్తి చేసి బయటకొచ్చారు. నేనెళ్ళి చప్పున ఆయన కాళ్ళకి దణ్ణం పెట్టాను. కారణం లేకుండా ఎందుకు దణ్ణం పెట్టానో ఆయనకి అర్ధం కాలేదు. “దేనికిలా ఈ దణ్ణం, ఏమిటి విశేషం?” అనడిగారు. నేనేమీ మాట్లాడలేదు.
ఇక చదవండి…..