Anaithekam Telugu Novel
Anaithekam Telugu Novel
అనైతికం
షామ్లా చెప్పిన కథ :
జార్జి స్క్వేర్ నుంచి క్వీన్స్ సర్కిల్ వైపు మలుపు తిరుగుతూ కారు నెమ్మదిగా స్లో చేశాను. దూరంగా ఎత్తైన కోర్టు భవంతి కనపడుతోంది. దాదాపు వెయ్యిమంది దాకా వుంటారు జనం!
చుట్టూ పోలీసులు కవచంలా వున్నారు. బి. బి. సి. తో సహా ఇరవై టీ. వీ. కెమెరాలు ఆ దృశ్యాన్ని చిత్రీకరిస్తు న్నాయి. జనం ప్లేకార్డులు పట్టుకుని నిలబడి వున్నారు. ‘స్త్రీ స్వాతంత్ర్యానికి గౌరవం ఇవ్వాలి’, ‘విమెన్ లిడ్ స్త్రీల ఆశయం’ లాంటి స్లోగన్లు ఆ ప్లే కార్డుల మీద రాయబడి వున్నాయి. అక్కడ వున్న వారందరూ శ్రీలే. తొంభైశాతం
బ్రిటిషర్లు. కొద్దిగా గర్వం కలిగింది.
వారందరికీ నేను ప్రతినిధిని !
వారి తరఫున వాదించబోతున్న లాయర్ని !!
ఒక భారతీయురాలినై వుండీ, ఎక్కడో దేశం కాని దేశంలోఅంతమంది బ్రిటిషర్ల తరఫున వాదించబోతున్న శ్రీ నాకు ఆ మాత్రం గర్వం కలగటంలో ఆశ్చర్యమేముంది?
కారు దిగి కోర్టు మెట్లు ఎక్కుకుంటే జనం హర్షధ్వానాలు చేస్తూ చప్పట్లు కొట్టటం ప్రారంభించారు. దాదాపు కెమెరాలన్నీ నామీదే ఫోకస్ చేయబడి వున్నాయని నాకు తెలుసు.
అక్కడ పెద్ద గొడవేమీ జరగదని నిశ్చయంగా తెలియటంవల్ల నేమో, పోలీసులు కూడా దీన్ని నవ్వుతూ చూస్తున్నారు. ఇదంతా వారికి ఒక సినిమా షూటింగ్ లా అనిపిస్తుందేమో అన్న భావం నాకు చిరాసతో కూడిన ఉక్రోషాన్ని కలిగించింది.
“అవును మరి ! స్త్రీల నైతిక విజయానికి సంబంధించిన
సమస్య ఇది.”
ఇక చదవండి…..
Visitor Rating: 3 Stars
Visitor Rating: 1 Stars
Visitor Rating: 4 Stars