Antapura kanya Telugu Novel
Antapura kanya Telugu Novel
అంతపుర కన్య తెలుగు నవల
పురిటి నొప్పులు పడుతున్న స్త్రీలా వుందా హాస్పిటల్.
ఎమర్జన్సీ టైంలో సహాయాన్నందించే మిలటరీ డాక్టర్స్ చకచకా చేసుకుపోతున్నారు అయిదుగురు డాక్టర్స్. హాస్పిటల్ వరండాలో నర్సులు తొలిసరాగా కాన్పు వచ్చిన స్త్రీలా కంగారు పడుతున్నారు.
వారికి అతీతంగా గదిలో బెడ్ మీద స్పృహ లేకుండా వున్న ఇరవయ్ ఏళ్ళ అమ్మాయి వంక చూస్తూ భారంగా కళ్లు మూసుకున్నాడు గోడకి ఆనుకుని ఓ నడివయస్కుడు.
రెండు గంటల సుదీర్ఘ శాంతి చర్చల తర్వాత గొంతు సర్దుకుని చెప్పిన మంత్రిలా ఆ హాస్పిటల్ ప్రధాన డాక్టర్…
‘గోవర్ధనరావుగారు” పిలిచాడు వినమ్రతగా. ఆ నడివయస్కుడు కళ్ళు తెరిచి గుండెల్లోని బాధ కళ్ళల్లో డాక్టర్కి కనపడకూడదని కళ్లు తుడుచుకున్నాడు.
“మరేం పర్లేదు.. తెలివి రావడానికి అయిదారు గంటలు పట్టవచ్చు లేదా అయిదు నిమిషాల్లో కూడా కళ్ళు తెరవచ్చు. అసలెలా జరిగింది…”
“అమ్మాయి ఉదయం జిమ్ నుంచి వస్తుంటే క్రికెట్ బాల్ తగిలింది.
ప్లే గ్రౌండ్ పక్కనే మా ఇల్లు. బంతి వచ్చి సరిగ్గా తల మీద తగిలింది. పెద్దగా అరిచి కుప్పకూలిపోయింది.”
“లేచిన వేళావిశేషం బావుంది. మీకర్థమయ్యే భాషలో చెప్పాలంటే జంక్షన్ బాక్స్ పక్కన తగిలింది లేదంటే…”
“మరేం పర్వాలేదంటారా?”
“మీరు అనవసంరగా టెన్షన్ పడుతున్నారు. బి.పి. పెరిగిందంటే మీరు కూడా ఎడ్మిట్ కావాలిసి వుంటుంది…. మీరు కూర్చుందురు రండి” చెప్పి పేషంట్ వేపు తిరిగాడు.
కొండమీది నుంచి నిశ్శబ్దంగా పడే నీటి చెరియలా వుంది ఆమె ….. బ్రహ్మదేవుడు రతీదేవి మీద కోపంతో నీకంటే అందగత్తెను సృష్టిస్తాను చూడు అని శపధం పట్టి మరీ తయారు చేశాడా అన్నంత అందంగా వుంది.
అంతటి అందం ఆరోగ్యం వల్ల వచ్చిందా? ఆరోగ్యం వల్ల అంత అందంగా వుందా? అర్థంకాలేదా డాక్టర్కి. కానీ ఒక్కటి మాత్రం అనుకున్నాడు.
ఈజిప్టులు చూస్తే తమ అద్భుత అందాల శృంగార దేవత ‘ఇసీన్’ ఈవిడే అంటే ఆలోచించకుండా నమ్మేస్తారు.
‘గ్రీకులయితే ఏకంగా ఈజిప్టులకి అడ్డమైపోయి, మా సౌందర్య దేవత వీనస్ ఈమే… అని చెప్పి అడ్డం వస్తే అడ్డంగా నరుకుతాం అన్నంత రేంజ్లో
ఆ డాక్టర్ తల విదిలించుకుని తన వృత్తి ధర్మాన్ని మరొకసారి గుర్తు చేసుకుని గోవర్ధనరావుగారితో తన గదివైపు నడిచాడు.
ఇక చదవండి…..
Visitor Rating: 4 Stars
Visitor Rating: 3 Stars