Anyonya Dampatyam Telugu Novel
Anyonya Dampatyam Telugu Novel
అన్యోన్య దాంపత్యం తెలుగు నవల
ఈగ్రంధం దాంపత్య జీవితాన్ని సుస్సంపన్నంగా తీర్చిదిద్దడానికి ఉద్దేశింపబడింది. ఈ వాక్యం చదవగానే వైవాహిక జీవితం గురించి తాము క్రొత్తగా తెలుసుకోవలసినదేమున్నదంటూ చాలామంది నవ్వుకొంటారు. మన సమాజంలో అత్యధిక శాతం మంది దంపతులు వివాహం ద్వారా తమకు యధాలాపంగా లభించే పరిమిత ఆనందంతోనే సంతృప్తి చెందుతున్నారు. ఇటువంటి వారు తమ తమ దాంపత్యజీవితాలను గురించి పెద్దగా పట్టించుకోకుండా భిన్న స్థాయిలలో తమ దాంపత్యాలను గడుపుతున్నారు. ఏనాడు రవ్వంత విచారానికి లోనుకాని దాంపత్యాలనుండి అసలు చిరునవ్వుకే నోచుకోని దాంపత్యాల వరకు ఇవి విస్తరించివుంటాయి.
వైవాహిక జీవితాన్ని గురించి అలోచించకుండా యాంత్రికంగా, అనాలోచితంగా దాంపత్య జీవితంలోకి ప్రవేశించే యువతీయువకుల దాంపత్యం, మన సమాజంలోని సగటు దాంపత్యాలలాగా పేలవంగా, నిస్తేజంగా, నిస్సారంగా మిగిలిపోవడంలో ఆశ్చర్యమేదీలేదు. వైవాహిక జీవితంలో సంతోషం దానంతటదే లభిస్తుందని ఎదురుచూసేవారికి సహజంగానే నిరాశా, నిస్పృహలే మిగులుతాయి. మనలో చాలమంది దాంపత్యానుబంధాన్ని తేలికగా, చులకనగా, తాము పెద్దగా ఆలోచించనవసరం లేనిదిగా చూడడం. వలన, తన తోటలో విప్పారిన పుష్పాల మృదుమనోహరసోయగాన్ని, వాటి సౌరభాన్ని పట్టించుకోలేని తోటమాలిలాగా, తమ దాంపత్యాన్ని రసభరితంగా, అనుక్షణం ఆనందపారవశ్యాల మైమరుపుగా మలచుకోకలిగి కూడా తమ ఆలోచనా రాహిత్యంతో రసహీనంగా మిగిల్చివేస్తున్నారు. ఇందుకు భిన్నంగా, తమంతటతాము తమ సంసారంలో స్వర్గధామాన్ని సృష్టించుకోవాలని నిశ్చయించుకొని, అందుకై స్పష్టంగా ప్రయత్నించేవారికి మాత్రమే తమ దాంపత్యంలో సర్వసుఖాలు లభ్యమవుతాయి. తమ చుట్టూ వున్న స్థితిగతులన్నీ యధాతధంగానే వున్నప్పటికీ, తమ ఆలోచనా ధోరణిలో, ప్రవర్తనా సరళిలో అతిసులభమైన కొద్దిపాటి సవరణలు చేసుకోవడం ద్వారా భార్యాభర్తలు తమ దాంపత్యాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. తమ భూతలస్వర్గాన్ని సృష్టించుకోవచ్చు.
ఇక చదవండి …..