Asura panjaram Telugu Novel
Asura panjaram Telugu Novel
అసుర పంజరం తెలుగు నవల
“అస్థిమూల పంజరాలు ఆర్తరాన మందిరాలు ఏ లోకం తల్లి భాష్ప జలాలు?” అరచేతిలోకి జారిపడిన అశ్రు బిందువును చూసి ఆ వృద్ధుడు ఉలిక్కిపడ్డాడు. అంతలోనే ఆ అశ్రువు అయన అరచేతి రేఖల్లోంచి చకచకా ప్రవహించి అదృశ్యమైపోయింది. ఆ వృద్ధుడి ముఖంలో ఆందోళన మరీ అధికమైంది. ఆయన పేరు ప్రొఫెసర్ భగవంతం. ఆయన వయస్సు యాభై ఏడు సంవత్సరాలు. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ లో సోషియాలజీ హెడ్ ఆఫ్ డిపార్టుమెంటుగా పని చేస్తున్నారాయన. ఆరడుగుల భారీ విగ్రహం తెల్లగా పండిపోయిన జుట్టు విశాలమైన బాహువులు వయసులో ఉన్నప్పటికన్నా ఆయన యిప్పుడే అందంగా వున్నాడేమో అనిపిస్తుంది నిజానికి అది అందం కాదు హుందాతనం.
జీవితాంతం నిరవధీకంగా, నిర్విరామంగా చదవటంవల్ల ఆయన కళ్ళు దివ్యమైన కాంతితో నిండిపోయాయి. ఆయన సుదురు కాంతిగోళాలు నిండిన భూమండలంలా ప్రకాశిస్తూ వుంటుంది.
చాలా జాగ్రత్తగా చూస్తే భగవంతుడు వృద్ధుడయితే ఎలా వుంటాడో ప్రొఫెసర్ భగవంతం సరిగ్గా అలాగే వుంటాడనిపిస్తుంది.
ప్రొఫెసర్ భగవంతం నడుస్తున్న గ్రంథాలయం లాంటివాడు. మానవజాతి చరిత్రను సోషియాలజీలో సమన్వయపరిచి చదవటం అంటే ఆయనకెంతో యిష్టం.మనుషిలంటే ఆయనకు అంతులేని ప్రేమ.మానవజాతికి చిన్న విపత్తు సంభవిస్తుందంటే ఆయన దాన్ని మూత్రం కూడా సహించలేదు.
అందుకే ఆయన మనిషి చరిత్రను, ప్రవర్తనను, అందులో స్తున్న మార్పులను చాలా నిశితంగా పరిశీలిస్తూ, పరిశోధిస్తూ ఉంటాడు. సోషియాలజీలో ఆయన చేసిన పరిశోధనలకు దేశ విదేశాల్లోస్ముఖంగా ప్రశంసలు లభించాయి.
ఇక చదవండి….
Visitor Rating: 5 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 1 Stars
Visitor Rating: 1 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 3 Stars