Athadu Aame Priyudu Telugu Novel
Athadu Aame Priyudu Telugu Novel
అతడే ఆమె ప్రియుడు తెలుగు నవల
“నీ ఆఖరి కోరికేమిటి ?”
భోజనం చేస్తున్న మహర్షి నెమ్మదిగా తలెత్తాడు. జైలర్ మొహం చిరాగ్గా వుంది. మరుసటిరోజు ఉరితీయబడే ఖైదీని ఏదో అడగాలి కాబట్టి అడుగుతున్నట్టు వుందేతప్ప ఆ కంఠంలో మహర్షిపట్ల ఏ సానుభూతి లేదు.
మహర్షి సమాధానం చెప్పకుండా మౌనంగా వుండి
పోయాడు.
“ఏం, మాట్లాడవేం?”
“ఆలోచిస్తున్నాను…. ఏ ఆఖరి కోరిక కోరాలా అని” అతడి కంఠం జీరగా, నిర్లక్ష్యంగా పలికింది. మణితో
“పిచ్చి పిచ్చివేమీ అడక్కు. నీ పేరున ఏదయినా ఆస్తివుంటే వీలునామా వ్రాయటం, నువ్వెవరినయినా చూడ దలుచుకుంటే వాళ్ళకోసం కబురు చేయటం అలాంటివైతేనే అనుమతిస్తాం.”
“సాధారణంగా ఉరికంబం ఎక్కేముందే ఆఖరి కోరిక అడుగుతారు. మీరేమిటి ఒకరోజు ముందే అడుగుతున్నారు?”
“ఏంట్రా…. ఏదో పెద్ద రూల్స్ తెలిసినట్టు మాట్లాడతావ్? సినిమాలు చూసీ, పుస్తకాలు చదివి తెలుసుకున్నావా? అలాంటిదేం లేదు, నువ్వెవరినైనా చూడాలనుకుంటే చెప్పు, పిలిపిస్తాను.”
మహర్షి చేతిలో అన్నం ముద్దకేసి తదేకంగా చూస్తూ వుండి పోయాడు. జైలర్ కొనసాగించాడు. “అందుకే ఓ రోజు ముంద గేది. ఉరికంబం మెట్లమీద నాకు ఫలానా వాళ్ళని చూడాలని వుందంటే ఉరితీయటం ఆపుచేసి వాళ్ళని పిలిపిస్తారనుకోకు. అదంతా ముందు నేను చెప్పినట్టు యేదో కథల్లో జరిగేది.”
మహర్షి ఇంకా అన్నం ముద్దవైపే చూస్తున్నాడు. జైలర్ అసహనంగా “ఏరా…. ఏమన్నా చెబుతావా?
పోయి ఉరి యేర్పాట్లు చేసుకోనా?” అనడిగాడు రి
“నాకో కోరికుంది సారూ” మహర్షి. ఏమిటది? తొందరగా చెప్పేడువు.”
“నా కొక అమ్మాయిని చూడాలనుంది.”
జైలర్ ఉలిక్కిపడ్డాడు. మొహం చిట్లించాడు. “అమ్మాయినా • కెవరూ కూతుళ్ళున్నట్లు తెలీదే? పెళ్ళయిన ఆర్నెల్లకే పెళ్ళాన్ని కంపేసేవుగా” అన్నాడు.
“కూతురు కాదండీ, నా స్నేహితురాలు.” “ఏంటీ? నీకో స్నేహితురాలు కూడా వుందా?”
ఇక చదవండి….
Visitor Rating: 1 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 2 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 3 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 3 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 5 Stars