Avyaktham Telugu Novel
Avyaktham Telugu Novel
అవ్యక్తము తెలుగు నవల
ప్రకృతి ఒడిలో పసిపాపలా ఒదిగివుంది ఆచిన్న పల్లెటూరు. సూర్యాస్తమయం అవుతోంది. ఊరి చివర చిట్టడవికి మేతకి వెళ్ళిన పశువులమంద యింటికి తిరిగి వస్తోంది. మట్టిరోడ్డు మీద వాటి గిట్టలతో రేగుతున్న ధూళి మేఘంలా కదులుతూ లేస్తోంది. ఆకాశం నుంచి దిగివచ్చిన సూర్య కిరణాలు చెట్ల కొమ్మల మధ్యనుండి దూసుకు వచ్చి పుడమితల్లిని ముద్దాడి వీడ్కోలు చెబుతున్నాయి. ఊరి చివర బావినుండి ఆడవాళ్ళు బిందెలతో నీళ్ళు మోసుకువెళ్తున్నారు. వారు చెప్పుకునే ముచ్చట్లకి రావిచెట్టు తలవూపుతున్నట్టు చిరు గాలిగా కొమ్మలు కదులుతున్నాయి.
మట్టిరోడ్డు మీద నుంచి జట్కా బండి ఒకటి పూరిమధ్యకి వెళుతోంది. మెదకి జరీ కండువా, నుదుటన వీభూదిరేఖలు ధరించిన షుమారు 50 సం వయసుగల వ్యక్తి కూర్చుని వున్నాడు. ఆయనతో పాటు బక్కపలచగా, పోషణ పొడుగ్గా 10 సంవత్సరాల కుర్రాడు వయసుకి మించిన గాంభీర్యంతో వున్నా
బండి వూరి మొదట్లో వున్న మసీదు ముందు కూర్చుని తత్త్వం పాడుతూ ఫకీరుని దాటి వెళ్తుంటే, మడిచిన గొడుగు భుజాల వెనక అడ్డంగా పెట్టుకుని, ఆనించి వస్తున్న రైతు “నమస్కారం దీక్షితులుగారూ” అంటూ బండి వెంట మర్యాదగా నడవసాగాడు.
ఆయన మన్ననలు అలవాటయిన వ్యక్తిలా తలపంకించారు. “ఎవరండీ యీ కుర్రాడు?” అడిగాడు రైతు..
“మా దూరపు బంధువుల అబ్బాయి సాంబయ్య. మేనత్త చచ్చిపోతూ నాకు అప్పచెప్పింది”
ఇక చదవండి…
Visitor Rating: 5 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 3 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 1 Stars
Visitor Rating: 1 Stars
Visitor Rating: 2 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 1 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 3 Stars
Visitor Rating: 3 Stars
Visitor Rating: 3 Stars
Visitor Rating: 5 Stars