Donga Donga Patukondi Telugu Novel
Donga Donga Patukondi Telugu Novel
దొంగ దొంగ పట్టుకోండి తెలుగు నవల
దొంగ దొంగ దొంగ”..పట్టుకోండి… పట్టుకోండి”చెవులు చిల్లులు పడేస్థాయిలో వినవచ్చాయి ఆ అరుపులు. అదిరిపడి చెక్కబల్లల మీదినించి లేచి నిలబడ్డారు చాంపూర్ చౌకత్మహల్ సెంటర్లో జానూభాయ్ టీ కొట్టు దగ్గర టీ తాగుతూ కూర్చుని ఉన్న కస్టమర్స్.
పాడు బాణాకర్రలు పట్టుకుని సెంటర్లోకి పరిగెత్తుకు వచ్చారు పది మంది యువకులు, “పకడో… చోర్ బద్మాష్ పకడో…” చుట్టూ చూస్తు ఇంకాస్త బిగ్గరిగా అరిచాడు వారిలో ఒకతను.
“ఎవర్ని పట్టుకోవాలి బేటా? అసలేమిటి ఈ గోల?” పది అడుగులు ముందుకేసి చనువుగా ఒక యువకుడిని అడిగాడు జానభాయ్ కస్టమర్స్లో ఒక వృద్ధుడు, “దిల్దార్ సెట్ ఇంటికి కన్నంచేశారు ఎవరో… తాకట్టు పెట్టించుకున్న నగల్ని, దస్తావేజుల్ని కొట్టేశారు. గోడదూకుతుంటే వాచ్మన్ చూశాట్ట” అసలు విషయాన్ని వివరముగా చెప్పాడు ఆ యువకుడు. “దిల్దార్ సేట్ ఇం టికే కన్నం వేశారంటే వాళ్లే
వరో సామాన్యమయిన దొంగలు అయివుండరు.. రాంచీ ని ఏరియావించి బందిపోట్లు వచ్చి ఉంటారు “ఆ యువకుడి వైపు చూస్తూ సాలోచనగా అన్నాడు వృద్ధుడు.
“లేదు కాకా… బందిపోట్లు కారు. ఇద్దరే ఇద్దరు. వల్ల ఎ. ప్యాంటు, బూడిద రంగు షర్దుట ఒక కుర్రాడిది… పొట్టిగా, ” లావుగా, పిచ్చివాడిలా ఉన్నట్టు రెండోవాడు. కన్నం నాగా వేసింది ఇద్దరే “విషయాన్ని చెప్పాడు ఆ యువకుడు. ఝల్లుమన్నది వృద్ధుడి శరీరం, ఏదో ఆలోచన వచ్చింది.
అతనికి, బైట పెట్టటానికి కొంచెం తటపటాయించాడు. “పదండితారా… ఇంతమంది ఉన్న సెంటర్ దరిదాపు లకి కూడా వాళ్ళు రారు. హనుమాన్ గుడి దగ్గరికి పోదాం… పదండి….” ఉన్నట్లుండి ఇంకో యువకుడు చెప్పడంతో, స్పీడ్గా కదిలారు ఆ కుర్రాళ్ళందరూ…
పెద్ద పెద్దగా అరుస్తూ సెంటర్కీ ఎడమవైపున ఉండే ఒక నీధిలోకి వడివడిగా వెళ్ళిపోయారు.
విద్రలో నడుస్తున్నట్టు అడుగులు వేస్తూ టీకొట్టు దగ్గరికి తిరిగి వచ్చాడు వృద్ధుడు. “ఇప్పటిదాకా హుషారుగా ఉన్నావ్. ఇంతలోనే ఏమయింది కాకా?” అతనిని చూస్తూ నవ్వుతూ అడిగాడు జానూభాయ్.
“నాకు ఏమీ కాలేదు బేటా… నేను బాగానే ఉన్నాను. మన ఊరికే ఏదో శని పట్టుకోబోతోంది… అది తలుచు కునేసరికి ఎందుకో బాధ కలిగింది” చెక్కబల్ల కూర్చుంటూ అన్నాడు ఆ వృద్ధుడు.
Visitor Rating: 4 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 3 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 2 Stars