Abhijatha Part-2 Telugu Novel by Yaddanapudi
Abhijatha Part-2 Telugu Novel by Yaddanapudi
అభిజాత తెలుగు నవల
భ ద్రిక పంపిన కవరు అందింది. ఆడిట్ అయిన మర్నాడు శలవు నిమని తీసుకున్న నేను యింట్లోనే వున్నాను. పిల్లలు స్కూలుకి వెళ్ళారు. నేను కూర్చుని ప్రశాంతంగా చదవసాగాను. భద్రిక ముందుమాట అని హెడ్డింగ్ పెట్టి యిలా వ్రాసింది. “భద్రికి – గిరీష్ ఒక పెళ్ళిలో పరిచయం అయారు. గిరికి ఎడమకాలు చిన్నప్పుడు యాక్సిడెంట్ పోయింది. చంకల క్రింద కర్రలతో నడుస్తాడు. ఇద్దరికీ కామన్ ఇంట్రెస్ట్ సంగీతం. గిరి బాగా పాడుతాడు. పరిచయం పెరిగింది. భద్రిక స్వీట్స్
షాప్ పెట్టెలో స్వీట్స్ నింపే చిన్న వుద్యోగం చేస్తోంది. ఆ రోజు భద్రిక షాప్ నుంచి బైటకి వస్తోంది.
గిరీష్ చంకల క్రింద కర్రలతో నడుస్తూ వస్తున్నాడు. భద్రిక అతని దగ్గరకి
పరుగెత్తుకు వచ్చింది.
“గిరీష్ ! రేడియో ప్రోగ్రాం ఎలా అయింది ?”
“బాగా అయింది. థ్యాంక్స్ భద్రికా.” “నాకెందుకు చెబుతావు ?”
“నువ్వు తెలిసిన వాళ్ళకి చెప్పకపోతే నాకీ ప్రోగ్రాం వచ్చేది కాదు.”
“అలా అనకు.”
“నువ్వు యీ రోజు మా యింటికి భోజనానికి రావాలి.” “ఓ! అలా పెట్టకు. ”
“ఇది ఫార్మాలిటీ కాదు. సంతోషం. మా అమ్మకి చెప్పాను.” భద్రిక నడుస్తూంది. పేప్మెంట్ మీద గిరీష్ చంకల క్రింద కర్రల శబ్దంలో ఒక లయ.
“గిరీ !” భద్రిక పిలిచింది.
“నాకు విశాఖలో టీచర్ పోస్ట్ వచ్చింది.”
“”వెళ్ళక తప్పదా !”
ఇక చదవండి…
Visitor Rating: 1 Stars
Visitor Rating: 2 Stars
Visitor Rating: 3 Stars
Visitor Rating: 3 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 2 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 5 Stars