Abhijatha Telugu Novel by Yaddanapudi
Abhijatha Telugu Novel by Yaddanapudi
అభిజాత తెలుగు నవల
అంతవరకూ జల్లుగా పడిన వాన అప్పుడే కాస్త ఆగింది. మధ్య తరగతి సాంప్రదాయానికి పట్టుగొమ్మలా వున్న యిల్లు అది. వీధి గుమ్మానికి పసుపురంగు, దాని మీద ఎర్రటిబొట్లు పెట్టి వున్నాయి. అక్కడ నిలబడితే, యింట్లోకి వరసగా వున్న ద్వారాల్లోంచి పెరటిలో తులసి కోటలో నవనవలాడుతూ గుబురుగా ఎదిగిన తులసి చెట్టు కన్పిస్తోంది.
దానిమీద పూజచేసి భక్తిగా పెట్టిన పచ్చటి చామంతి అసలే బరువు, అందులో వానకి తడిసి మరింత భారం అయి పడబోతుంటే తులసి కొమ్మలు. పదిలంగా మోస్తున్నట్టుంది. మబ్బులు తొలగించుకుని తొంగి చూస్తున్న సాయం సూర్యుడి బంగారు కిరణాలు వీధి గుమ్మంలో నుంచి చొచ్చుకుని సూటిగా వెళ్ళి చిన్న చిన్న వాన బిందువులు నిల్చిన తులసి చెట్టు మీద చామంతితో స్నేహం చేయటానికి తహతహలాడ్తున్నట్టున్నాయి.
పెరటి గుమ్మం పక్కనే వున్న కిటికీ దగ్గర డైనింగ్ టేబిల్ మీద బీన్స్ పోసుకుని ఒక వయసు మళ్ళినావిడ వాటిని చిన్న చిన్న ముక్కలుగా తుంపుతోంది. ఆవిడ కళ్ళు మాటిమాటికి గోడకి వున్న పాత గడియారం వైపు, వీది గుమ్మం వైపు మార్చి మార్చి అసహనంగా చేస్తున్నాయి.
అక్కడికి కొద్ది దూరంలో గ్రిల్ దగ్గర పడక్కుర్చీలో, ఛామనచాయగా, బక్కపలచగా, వయసుతో అనారోగ్యంతో కాస్త వంగిన మనిషిలా వున్న ఒక పెద్దాయన కుర్చీ చేతిమీద రైటింగ్ సాడ్ పెట్టి తల ఒక పక్కకి కొద్దిగా వేసి, ఏకాగ్రతతో ఉత్తరం వ్రాసుకుంటున్నాడు. గోడకి వున్న గడియారం ఆరు గంటలు కొట్టింది.
ఇక చదవండి…
Visitor Rating: 1 Stars
Visitor Rating: 3 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 4 Stars