Anamakudi Hatya Telugu Novel
Anamakudi Hatya Telugu Novel
అనామకుడి హత్య తెలుగు నవల
డాక్టర్ రామచంద్ర చేతులు బేసిన్లో కడుక్కుని, యిస్త్రీ తువ్వాలతో తుడుచుకుని, కుర్చీలో చతికిలబడ్డాడు. “డాక్టర్! పదకొండు గంటలయింది. డిస్పెన్సరీ మూసెయ్యనా?” అడిగింది
నర్సు. ఏవో ఆలోచనల్లోంచి తెప్పరిల్లి డాక్టర్ రామచంద్ర తలవూపాడు.
తలుపులు మూస్తున్న చప్పుడు, నర్సు బూట్సుల టకటక, తాళం చెవుల గలగల తప్ప ఇంకేమీ వినిపించడంలేదు రామచంద్రకి, బల్లసొరుగులోంచి ఒక ఫోటో తీసి బల్లమీద పెట్టుకుని తదేకంగా, తన్మయత్వంతో ఆ ఫోటోని చూస్తున్నాడు.
ఇరవై యేళ్ళ యువతిది ఆ ఫోటో. ఆమె పేరు కాంతం. ఏడాది మూడు నెలలయింది కాంతం మరణించి, నవ్వుతున్న ఆ ఫోటో ఎన్నిసార్లు. ఎంతసేపు చూసినా యింకా చూడాలనే వుంటుంది రామచంద్రకి. కళ్ళల్లోంచి నీళ్ళు ధారలుగా కారుతున్నాయి. అలా ఆ ఫోటో చూస్తూనే వున్నాడు అతను..
“డాక్టర్!” పిలిచింది నర్సు చిత్ర.
“”నేను వెళ్ళనా?”
“ఊ!” అని లేచి వెళ్లి వాకిలి తలుపువేసి లోపల గడియ పెట్టి, వచ్చి మళ్ళీ కుర్చీలో కూర్చున్నాడు. కాంతం ఫోటో రెండుచేతుల్లో పట్టుకుని మృదువుగా ముద్దుపెట్టుకున్నాడు. ఫోటో బల్లమీద పెట్టి, తన తల ఫోటోముందు వాల్చి వెక్కి వెక్కి ఏడ్వడం ప్రారంభించాడు.
“కాంతం! పోయావా! వెళ్ళిపోయావా! నాకు ఇక కనిపించవా! ఒక్కసారి రావూ! నిన్ను చూడాలని వుంది!” పోయిన కాంతాన్ని పిలుస్తూ ఏడుస్తున్నాడు. కాంతం మరణించి యేడాదీ మూడు నెలలయింది.
Visitor Rating: 2 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 2 Stars
Visitor Rating: 2 Stars
Visitor Rating: 5 Stars