Anandho Brahma Telugu Novels
Anandho Brahma Telugu Novels
ఆనందో బ్రహ్మ తెలుగు నవల
2044 ఎ.డి.
ప్రపంచం.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా.
ఆంధ్రదేశం.
సమయం 10-55..
రామారావ్ స్టాచ్యూ నుంచి రాజీవ్ అవెన్యూ వైపు వెళుతూంది భరద్వాజ కారు.
భరద్వాజ మనసంతా చిరాకుగా వుంది. అతడి మూర్కి సరిపడ్డపే
కారులో పాట వస్తుంది. “కలిమిలేములు…. కష్ట సుఖాలు….. కావడిలో
కుండలనే భయమేలోయీ….”.
ఎప్పటి పాట అది? అతడు క్యాసెట్ తీసుకుని చూశాడు. దాదాపు తొంభై సంవత్సరాల క్రితం పాట.
అతడు ఛానెల్ మార్చాడు.
“ఆగదు ఆగదు ఈ నిముషమూ…. ఆగితే సాగదు ఈ లోకము”. బాలసుబ్రహ్మణ్యం- 1981.
“అవును ఈ లోకము ఎవరికోసమూ.”
ఎనభై సంవత్సరాల క్రితం ఘంటసాల లేకపోతే తెలుగులో పాట లేవనుకొనేవారట. అప్పట్లో జనం పక్క నుంచి రాకెట్లా దూసుకొచ్చాడు. బాలసుబ్రమణ్యం. అతడి తరువాత వచ్చింది అనిల్ గోవింద్. అప్పటి నుంచీ మొన్న మొన్నటివరకూ అతడు ఏకచక్రాధిపతిలా రాజ్యమేలాడు. చిన్న కుదుపు… రామ్ కె. గంటి (పూర్తిపేరు కోగంటి రమణావో, కొడవటిగంటి రామారావో) అనే కుర్రవాడు చిన్న ప్రయోగం చేశాడు. ఇళ్ళల్లో ఉపయోగించుకొనే పరికరాలు దువ్వెన, చీపిరికట్ట, గ్లాసులో నీళ్లు వీటిని వాలుగా ఉపయోగించి చిన్న ప్రయోగం చేశాడు. నలభై సంవ త్సరాల క్రితం కాస్త పురుష స్వరం మిళితమైన శ్రీ కంఠం కలిగి ఉషా ఉతప్ని ఎలా ప్రజలు వెర్రిగా ఆదరించారో, ఆడపిల్లలున్న అతడి నాజూకు కంఠాన్ని అంత విపరీతంగానూ ఆమోదించారు. నెలరోజులు తిరిగేసరికి పాటల ప్రపంచానికి రామ్కే గంటి మకుటంలేని మహారాజు అయిపోయాడు. తెర మరుగుకు వెళ్ళిపోయే స్థితినీ, మానసిక వ్యధనీ తట్టుకోలేక అనిల్ గోవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా 2038లో జరిగింది.
ఇక చదవండి…
Visitor Rating: 4 Stars