Apoorva Telugu Novel
Apoorva Telugu Novel
అపూర్వ తెలుగు నవల
అది లేతాకుపచ్చరంగులో తళతళా మెరిసిపోతున్న కారు. హైదరాబాద్ నగర వీధుల్లో మెత్తగా దూసుకుపోతోంది.అప్పటికి కొంత సేపటి క్రితమే శీతాకాలం సూరీడు తొంగిచూసాడు నగరం మీదికి.అక్కడక్కడా ఇంకా పొగమంచు కనబడుతోంది. ఆ కారులో డ్రయివరుతో బాటు
వెనక సీట్లో ఇద్దరు ప్రయాణిస్తున్నారు.
ఆ ఇద్దరిలో ఒకడు అరవై దాటిన వృద్ధుడు.రెండవ అతడు కోడెవయసు యువకుడు.
ఎప్పటిలాగే ఉదయం ఎనిమిది దాటగానే నగర వీధులు ట్రాఫిక్ మెజీ అయిపోయాయి. లేవగానే ఒకటే ఉరుకులు, పరుగులు. బిజీ నగర జీవితం యిది.
పొట్ట చేతపట్టుకుని పనికి బయలుదేరిన బడుగు జీవినుండి బడా వ్యాపారం చేసే ఉన్నత జీవి వరకూ ఒకటే బిజీ.
చదువుల కోసం, ఉద్యోగాల కోసం, సంపాదన కోసం, రాజకీయ వసరాల కోసం, ఇలా ఒకటేమిటి అనేకానేక అవసరాలకోసం తెల్లవార నే మనిషి వీధినపడి పరుగులు తీయక తప్పటంలేదు.ఈ పరుగులు ఈనాటివి కాదు.
జానెడు పొట్ట నింపుకోపటం కోసం ఆహారాన్వేషణతో దేరిన తొలి ఆది మానవుడినుంచి ఆరంభమైన పరుగులు…..
అంతరిక్ష రహస్యాలు శోధించే దిశగా అన్వేషణలో రో దూసుకుపోతున్న నేటి మానవుడి వరకూ ఈ పరుగులు కొనసానాటి మానవుడికి వున్నదీ, నేటి మానవుడికి లేనిదీ ఒకే ఒక్క అదే మనశ్శాంతి,
అవును.
ప్రస్తుత సమాజంలో ఏ వర్గంలో ఏ ఒక్కరినయినా చూడండి మీరు ప్రశాంతంగా జీవిస్తున్నారా అని ఖచ్చితంగా లేదు అన్నేసమాధానం వస్తుంది.
ఇక చదవండి…
Visitor Rating: 3 Stars
Visitor Rating: 3 Stars
Visitor Rating: 5 Stars