Atma Telugu Novel
Atma Telugu Novel
ఆత్మ తెలుగు నవల
వేడి గోళాలు శకలాలుగా మారి చిన్న చిన్న సూక్ష్మ రేణువుల్లా రూపుడాల్చి ఖాట్మాండ్ నగరాన్ని, ఆ పరిసర ప్రాంతాన్ని కప్పేస్తున్నాయి మంచు అణువులు,
భరించరాని చలి, ఈదురుగాలి సిటీ అంతా ఆక్రమించుకుంటున్నాయి. ఖాట్మాండ్ సిటీ నార్త్ లొకాలిటీలో ఓ వీధి చివరలో ముందుకు అడుగులు వేస్తున్నాడు ఒక వ్యక్తి.
భారీ ఆకారంలో వున్న ఆ వ్యక్తి కళ్ళు చాలా తీక్షణంగా వున్నాయి. కదలికల్లో హుందాతనం, పట్టుదల
ప్రస్ఫుటమవుతున్నాయి.
ఆ వ్యక్తి మహామేధావి అని చూసి ఎవరూ గ్రహించలేరు. మంత్ర తంత్ర విద్యల్లో అపారమయిన మేధావి.
అతను ఎంతో శక్తివంతమయిన క్షుద్రశక్తులు కూడా ఆ వ్యక్తి పేరు వింటూనే వణికిపోతుంటాయి.
పెరిగిన సైన్స్ విజ్ఞానం వెర్రితలలు వేస్తున్న ఈ తరుణంలో చాలామంది ఆతేంద్రియ శక్తుల్ని విశ్వసించరు.
కానీ యదార్ధం అది కాదు.
వారికి సరైన అవగాహన లేకపోవడమే అందుకు కారణం. అలాంటి వ్యక్తులు ఎవరయినా ఎదురయిన క్షణాల్లో జాలిపడుతూ వుంటాడు.
ఆ రోజు అమావాస్య,
క్షుద్రశక్తులకు చాలా ప్రీతికరమయిన రోజు అది.
భూతమాంత్రికులు, క్షుద్రశక్తుల్ని ఆవాహన చేసేవారు ఆ రోజును చాలా ముఖ్యంగా తీసుకుంటుంటారు. ఇప్పుడా వ్యక్తి ఏదో ఆలోచనతో ఖాట్మాండ్ బరియల్ గ్రౌండ్ వైపు వెళ్తున్నాడు.
మంచు తుప్పర్ల మధ్య ముందుకు వెళ్తున్న ఆ వ్యక్తి వెనుక వ్యక్తులకు కనిపించడు.
శ్మశానంలోకి ప్రవేశించిన ఆ వ్యక్తి ఒక మూలకు అడుగులు వేసాడు. అక్కడున్న చెట్టు తొర్రను సమీపించి తొర్రలోంచి కొన్ని వస్తువులు తీసాడు వెలుపలికి.
ముందుగా బ్లాక్ కలర్ కాండిల్స్ని ఎనిమిదింటిని వెలిగించాడు. ఆ వెలుగులో నేలను శుభ్రపరిచి మహాశక్తివంతమయిన భైరవ ఆవాహనకు సంబంధించిన యంత్రాన్ని చిత్రించాడు తన చేతి చూపుడు వ్రేలితో.. వాస్తవంలో అతనికాక్షణంలో తెలీని విషయం ఒక్కటే మానవాళికి మంచి చేయడానికి నిర్దేశించబడిన పాపను గా దురాచరుల సాయంతో హాని కలిగించనునా యని ఏమాత్రం ఊహించలేదు.
ఇక చదవండి…
Visitor Rating: 1 Stars
Visitor Rating: 2 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 3 Stars
Visitor Rating: 3 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 1 Stars