kommuri venugopala rao NovelsTelugu Novels

Atmajyothi Telugu Novel

Atmajyothi Telugu Novel

ఆత్మ జ్యోతి

స్త్రీ జీవితంకన్నా పురుషుడి జీవితమే చిత్రమైనది. కాకపోతే కాస్త వక్రమైనది. నాకు తెలిసినంతవరకూ ఏ ఆడదీ తననింతా మోసగించుకోదు పురుషుడు చేసే మొదటి తెలివితక్కువ పని అదే. స్త్రీ హృదయంలోతు తెలుసుకోవడం బ్రహ్మకైనా సాధ్యంకాదని అంతా అంటారు…మొదట శివనాథ రావుని గురించి చెబుతాను. అంతా అతన్ని శివాయ్ అనీ, శివా అనీ పిలుస్తారు. పైన చెప్పిన స్త్రీ హృదయాన్ని గురించిన సత్యంలోని నిజం ఎంతో అతనికి తెలియదు, తన జీవితకాలంలో ఏ స్త్రీని అర్ధం చేసుకోటానికి ప్రయత్నించనూ లేదు.

ఆ పని అతనికి విసుగుకూడా. అలా అని యీ విషయంలో అతనికి ఓనమాలు తెలియవని కాదు. అసలు ప్రపంచంలో ఏ విషయంమీదా అతనికి శ్రద్ధ నిలకడగా వుండలేదు. చదువు అంటే మొదట ఏమీ ఆసక్తి లేదు. చదివాడు. ఉద్యోగాలు చేయడమంటే అభిలాష లేదు. చేశాడు ఉద్యోగాలు. అర్జు అంటే అంతగా ప్రీతిలేదు. కొంతమంది అమాయకులతన్ని ఆర్టిస్టువన్నారు. పాపం గానం కొంచెం వినగలిగే ఓపిక వుంది. ఏమీ తోచనప్పుడూ, జీవితం మీద సరదా పుట్టినప్పుడూ, అదంటే భయం వేసినప్పుడూ కూనిరాగాలు తీస్తూ వుంటాడు, వయొలిన్ వాయిస్తాడు, గాయకుడని అక్కడక్కడా కీర్తి ఏర్పడింది.

ఇదంతా యిలా ఎందుకు జరుగుతోంది? మిగతావాళ్ళు యీ విషయాన్ని గురించి శ్రద్ధగా ఆలోచించి వుండరు. ఒకరిద్దరు మెరిట్ అని తోసేశారు. తీరిగ్గా వున్నప్పుడు అతను యీ విషయాన్ని గురించి ఆలోచించుకునేందుకు పూనుకుంటే ‘నక్షత్రాలెన్ని వున్నాయి, వాటిల్లో ఏమున్నాయి? అన్న ప్రశ్నలకు జవాబు ఏమొస్తుందో అదే వచ్చింది శివనాథరావునిగురించి చెబుతున్నాను. అంటే గాలివానతో ప్రారంభించాలి. గాలివాన… అదిగో విలయతాండవం చేస్తోంది..

ఇక చదవండి…

Atmajyothi_Page_098

Atmajyothi_Page_098
Picture 98 of 151

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *