Avesam Telugu Novel
Avesam Telugu Novel
ఆవేశం తెలుగు నవల
హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్ళే హైవేకి వున్న చిన్న సమీపంలో నర్రేకల్, సూర్యాపేటకు మధ్యన గ్రామం అది!
చిక్కగా పరుచుకున్న చీకటి బలప్రయోగానికి భయంతో వణికిపోతున్నట్లు మిణుకు మిణుకు మంటూ వెలుగు తున్నాయి. గ్రామంలోని వీధి దీపాలు.
అప్పటికే నిర్మానుష్యంగావాల్సిన గ్రామపు వీధులలో యింకా జనం కనిపిస్తూనే వున్నారు.. వీధి గుమ్మాలముందు నిలబడి గొంతులు బొంగురుపోయినట్లు గుసగుసలాడు కుంటున్నారు.
అందరిలోనూ ఏదో కయం… అదోరకమయిన టెన్షన్…
ఉంపిరి బిగబట్టినంత ఉత్కంఠత నెలకొని వుందక్కడ. అప్పుడు టైం రాత్రి తొమ్మిదిగంటలయింది.
అక్కడికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో వున్న హైవే నుండి
గ్రామంవరకూ వున్న మట్టిదారిగుండా దుమ్ముతెరల్ని రేపుతూ వచ్చి
గ్రామంలో ప్రవేశించాయి రెండు పోలీసు జీపులూ, రెండు గ్రామంలోని నాలుగువీధుల కూడలిలో వున్న జెండాస్థంభాన్ని సమీపించి ఆగాయి. ముందుజీప్ లో కూర్చున్న యన్సీ రంగనాధ్ ఇన్ స్పెక్టర్తో పాటు క్రిందికి దిగాడు. పాంటు జేబులో నుండి సిగరెట్ పేకెట్ను బయటికితీసి, సిగరెట్ నొకదాన్ని వెలిగించుకుని దమ్ములాగుతూ చుట్టూ చూసాడు.
ఇక చదవండి….
Visitor Rating: 3 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 2 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 3 Stars
Visitor Rating: 2 Stars