Bethala Prasnalu Telugu Novel
Bethala Prasnalu Telugu Novel
బేతాళ ప్రశ్నలు తెలుగు నవల
‘తులసీదళం’ నుంచీ ‘వెన్నెల్లో ఆడపిల్ల’ వరకూ ఒక రచయితగా, ‘అభిలాష’ నుంచి ‘అతిలోక సుందరి’ వరకూ ఒక సినిమా మనిషిగా యండమూరి చాలామందికి తెలుసు. కానీ తను మరొక రకంగా కూడా నాకు తెలుసు.
రామచంద్రపురం స్కూల్లో నేను చదువుకునే రోజుల్లో అక్కడే టైపు. షార్టుహాండూ నేర్చుకునేవాడు. ఇద్దరం కాకినాడ పి.ఆర్. కాలేజీ స్టూడెంట్లమే. నేను జూనియర్ని. ఆ సంవత్సరం కాలేజ్ ఫస్ట్ అతడే. అంతకు ముందు హైదరాబాద్లో (యాభై సంవత్సరాల) స్కూలు రికార్డుని కూడా బద్దలు కొట్టాడు. ఆపై సి.ఏ. పూర్తి చేసి, అతి చిన్న వయసులో ఆంధ్రాబ్యాంకు చరిత్రలోనే చాలా పెద్ద పోస్టు నిర్వహించిన వ్యక్తి వీరేంద్రనాథ్.
ఈ విషయం ఇక్కడ ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, ఇటువంటి పుస్తకం వ్రాయటానికి అర్హత వున్న రచయిత అతనే అని చెప్పటం కోసము. లెక్కల్లో ఎన్నడూ అతనికి నూటికి 95కి తక్కువ వచ్చేవి కావు. అతడి కొడుకుకి కూడా ఇంటర్లో స్టేట్ ర్యాంక్ వచ్చింది. ప్రస్తుతం సింగపూర్ స్టాక్ ఎక్చేంజి కంపెనీలో పనిచేస్తూ ఏడాదికి కోటి రూపాయలు జీతం సంపాదిస్తున్నాడు. పిల్లల్ని మంచి స్కూల్లో చేర్పించటంతో తల్లితండ్రుల బాధ్యత తీరిపోదని వీరేంద్రనాథ్ నమ్మకం. అది ఈ పుస్తకంలో చాలా చోట్ల కనపడుతుంది.
గతంలో నేనొక రష్యన్ పుస్తకాన్ని అనువదించాను. అందులోని పజిల్స్, హేతువాదం, శాస్త్రీయ దృక్పథం మొదలైన అంశాలు ఈ బేతాళ కథలు వ్రాయటానికి ప్రేరణ ఇచ్చాయని తను నాతో చెప్పాడు. పిల్లలకి ఇలాంటి పుస్తకాల అవసరం చాలా వున్నది.
పిల్లలంటే వీరేంద్రనాథ్ కి వున్న ఇష్టం గురించి కాకినాడలోని అతడి సరస్వతీ విద్యాపీఠం చూస్తే తెలుస్తుంది. అక్కడే మంచి జవాబులు చెప్పినందుకు ఎయిడ్స్ పేషెంట్ల సంతానానికి నాతోనే ఒకసారి చెప్పుల నుంచీ, బంగారం మెడల్స్ వరకూ బహుమతులుగా ఇప్పించాడు.
ఇక చదవండి..
Visitor Rating: 1 Stars
Visitor Rating: 4 Stars