Chandamama Kathalu

Makara Devata Chandamama Katha

Makara Devata Chandamama Katha

మకర దేవత చందమామ కథ

 

మరాళద్వీపానికి రాజైన మందరదేవుడు, ఒకనాడు ఉద్యానవనంలో విహరిస్తూండగా కోటద్వారం వద్ద పెద్ద కలకలం బయలు దేరింది. ప్రజల కేకలూ, సైనికుల హెచ్చ రికలతో కోటప్రాంతమంతా మారుమోగ ఇంతకలకలానికి కారణమేమిటా అని మందరదేవుడు ఉద్యానవనంనుంచి కోటద్వారంకేసి బయలుదేరాడు.
కొద్దిసేపటిలో మందరదేవుడు కోట ద్వారాన్ని సమీపించేసరికి మంత్రి ప్రజలను శాంతంగా వుండవలసిందని హెచ్చరించటం అతడి కంటబడింది. రాజు రాక గమంచిన కొందరు సైనికులు, ఆ సంగతి మంత్రితో చెప్పారు. వెంటనే మంత్రి వెనుదిరిగి రాజును సమీపించాడు.
“ఏమిటీ కలకలం?” అని ప్రశ్నించాడు మందరదేవుడు. మంత్రి క్షణకాలం కోట ద్వారంకేసి చూసి, “ప్రభూ, నిజమో అబద్ధమో యింకా ధృవపడలేదు. నావరకు నేను యిందులో కొంత నిజం వుండవచ్చు నని భావిస్తున్నాను. కుండలినీద్వీపం యీ మధ్య అరాజక స్థితిలో వున్నదని మన అందరికీ తెలిసినదే. పోతే యిప్పుడు వచ్చిన వార్త ఏమిటంటే – ఆ ద్వీప రాజ్యా కారాన్ని నరవాహనమిశ్రుడనే సేనాని హస్తగతం చేసుకుని మన రాజ్యంమీదికి దాడి బయలుదేరాడని. ఇది చేపలు పట్టబోయిన జాలరులు తెచ్చిన వార్త. ప్రజలు కలవరపడుతున్నారు. శాంతంగా వుండవలసింద హెచ్చరిక చేశాను,” అన్నాడు.

ఇక చదవండి..

Makara-Devata_Page_001

Makara-Devata_Page_001
Picture 1 of 144

0 thoughts on “Makara Devata Chandamama Katha

  • Visitor Rating: 2 Stars

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *