Marana Mrudangam Telugu Novel
Marana Mrudangam Telugu Novel
మరణ మృదంగం తెలుగు నవల
కరెంట్ లేదు. హరికెన్ లాంతరు వత్తి చివర మంట మినుక్కు మినుక్కుమంటూ వెలుగుతూంది.
ముందు పుస్తకమైతే వుందిగానీ, ఉత్పలమాల ఆలోచన్లు ఎక్కడో వున్నాయి. గెడ్డం క్రింద చెయ్యి ఆన్చుకుని ఆమె దీపంకేసి చూస్తూంది.
రాత్రి పదకొండు దాటింది. అందరూ నిద్రపోతున్నారు. ఆ గదిలోనే జంపఖానా మీద తమ్ముడు, చిన్న చెల్లి
చంపకమాల పడుకుని వున్నారు.
ఆమె తండ్రి విశ్వేశ్వర శాస్త్రి పండితుడు, కవిబ్రహ్మ. వచ్చిన అక్షరం తిరిగి రాకుండా, ఆశువుగా, లక్షణమైన సీసం చెప్పగలడని ప్రతీతి. ఆయన నిగర్వి. విశ్వనాథ వారి అనుంగు శిష్యుడు. వేటూరి ప్రభాకరశాస్త్రి గారికి ఏకలవ్యుడు. ఆయన క్లాసులో పాఠం చెపుతూవుంటే సరస్వతీదేవి గుమ్మంలో నిల్చుని వినేదని -సహాధ్యాపకుల ఉత్ప్రేక్ష,
ఆయన సరస్వతిని శాసించగల కుబేరుడు. పార్వతీ నామధేయురాలి పతిదేవుడు. లక్ష్మీ విషయంలో మాత్రం కుచేలుడు. తెలిసిన వాడెవ్వడు గవర్నర్ కాకపోవడంతో ఏ రాష్ట్రపు యూనివర్సిటీ ఆయన్ను పిలిచి డాక్టరేట్ ఇవ్వలేదు. స్వకులం వాడు ముఖ్యమంత్రి కాకపోవటంతో ఏ యూనివర్సిటీకీ ఆయన ముఖ్యాధికారి కాలేకపోయాడు.
ప్రతిభ కలవారు మూడు రకాలు!
తమ కళని తామే ఆస్వాదిస్తూ, ఆ కళామృతపానంలో అద్వైత సిద్ధికి చేరుకునే వేదాంతులు, ఆమని ఎందుకు వస్తుందో, కోయిలు ఎందుకు గానం చేస్తుందో, వీరూ అందుకే కళని రవళింప చేస్తారు. వీరు ఉత్తములు.
ఇక చదవండి……
Visitor Rating: 1 Stars
Visitor Rating: 1 Stars
Visitor Rating: 2 Stars
Visitor Rating: 1 Stars
Visitor Rating: 2 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 1 Stars
Visitor Rating: 3 Stars