Tenali Ramakrishna Kathalu
Tenali Ramakrishna Kathalu in Telugu
తెనాలి రామకృష్ణ కథలు
తెనాలి రామకృష్ణ కవి నూతన హాస్యకథలు
శ్రీకృష్ణదేవరాయల కొలువులో చేరిక
కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠేచ ముక్తావళీ
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి
రాగయుక్తంగా పాడుతున్న ఆగొంతువిని, విజయనగరసామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలు ఒక్కసారి ఉలికిపడ్డాడు. గజారూఢుడై సాగుతున్న ఆయన ఎందుకో తన ప్రయాణాన్ని నిలుపుదల చేసుకుని చెవులు రిక్కించి, ఏనుగు దిగి మెత్తగా అడుగులు వేసుకుని ఓ ఆలయంలో ప్రవేశించాడు. చూస్తే ఎన్నిసార్లయినా చూడాలనిపించే శ్రీకృష్ణుని విగ్రహం ముందు చేతులు జోడించి పై శ్లోకం కర్ణపేయంగా ఆలపిస్తున్న ఓభక్తుని చూసి అతన్ని సమీపించాడు.
రాయలను చూసిన ఆలయపూజారులు సర్దుకుని, ఆభక్తున్ని గర్భగుడిలోంచి పక్కకు నెట్టారు. అపుడు కళ్లువిప్పి చూసాదాభక్తుడు. “అయ్యా! లీనమై ఆదేవదేవున్ని తనివితీరా కొలుచుకుంటున్న నన్ను నెట్టడానికి కారణం నేనేమైనా తెలియని అపరాధం చేసిఉన్నానా?” అని అడిగాడు.
“స్వామీ! ఆవచ్చినది విజయనగర పురాధీశులు. ఇపుడే వచ్చి వెళ్ళారు. మరళ విచ్చేయడానికి కారణం తెలియదు. అందుకే భయపడు తున్నాం”బదులిచ్చి రాయలువారి ముంగిటికి పరుగున వెళ్ళారు పూజారులు.
“అరకులారా! ఎవరీ మహానుభావుడు ? ఎంత మధురంగా కృష్ణకర్ణామృతంలోని శ్లోకం ఆలపించారు. అదివిని మరళవిచ్చేసాను.”అని ఆభక్తునివైపు తిరిగి “వాగ్గేయకారుడు లీలాశుకుడు రాసిన కృష్ణకర్ణా మృతంలో రసాలూరించే శ్లోకం చిన్న చిన్న మార్పులు చేసి నాకు వినిపించి నాజన్మధన్యం చేసారు స్వామీ! ఎవరు మీరు? మీ దివ్యతేజస్సు చూస్తే సామాన్యులు కారని తెలుస్తోంది. “అని మృదుమధురంగా చిరునవ్వు చిందిస్తూ అడిగాడు శ్రీకృష్ణదేవరాయలు.
ఇక చదవండి…
Visitor Rating: 5 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 2 Stars